![Notification For Appointment Of Vice Chancellors For Universities In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/27/Telangana-govenment-logo.jpg.webp?itok=wiICsY7c)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది.
ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్)లకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment