Software Engineer Died in Road Accident - Sakshi
Sakshi News home page

Hyderabad: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

Published Sun, Jul 23 2023 2:13 PM | Last Updated on Sun, Jul 23 2023 2:44 PM

Software Engineer Died In Road Accident - Sakshi

ఘట్‌కేసర్‌: బైక్‌ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శివారెడ్డిగూడలోని మారుతీనగర్‌కు చెందిన సూరజ్‌ (28) తన స్నేహితుడి కారును రెండు రోజుల క్రితం తీసుకున్నాడు. దానిని ఇచ్చేందుకు శనివారం రాత్రి బాలాజీనగర్‌కు వెళ్లాడు.

అనంతరం స్నేహితుడి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌ సమీపంలోని మాధవరెడ్డి వంతెన వద్ద బైక్‌ అదుపుతప్పడంతో సూరజ్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో  పోలీసులు ఘటనాస్థలికి  చేరుకుని పరిశీలించారు.

మృతుడి మొబైల్‌ ద్వారా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement