శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేశారు. 6,7,8 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.69లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 58వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.4 అడుగులకు చేరుకుంది. దీంతో వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో మూడు గేట్లను ఎత్తిన అధికారులు.. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్కులను విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81వేల క్యూసెక్కుల నీటిని కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment