
సాక్షి, హైదరాబాద్: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసీఆర్ కీర్తించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు.