![Telangana DGP Mahender Reddy Twitter Followers Reached To 3 lakhs - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/7/mahender.jpg.webp?itok=DUMJdIZN)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్‌లో డీజీపీ ఫాలోవర్ల సంఖ్య గురువారంతో 3 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయి అధిరోహించడం తమ బాధ్యతలను మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. కాగా, అతి తక్కువ కాలంలోనే డీజీపీ ట్విట్టర్ హ్యాండి ల్ ప్రజలకు చేరువైంది. శాంతి భద్రతలతోపాటు, పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా డీజీపీ హ్యాండిల్‌కు ట్వీట్ చేయగానే వేగంగా స్పందిస్తారని ప్రతీతి. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ 3 లక్ష ల ఫాలోవర్లతో దక్షిణ భారతదేశంలోని డీజీపీల్లో మొదటిస్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment