
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) చరిత్రలోనే తొలి జూనియర్ లైన్‌ఉమెన్‌గా సిద్దిపేట వాసి బబ్బూరి శిరీష ఘనత సాధించారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నుంచి బుధవారం ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్‌ఎంగా నియమించారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా మహిళలను జూనియర్ లైన్‌ఉమెన్లుగా నియమించినట్టు మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా మహిళలను ఈ పోస్టుల్లో నియమించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని శిరీష ఈ సందర్భంగా పేర్కొన్నారు. లైన్ ఉమెన్ పోస్టుకు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: Hyderabad: రూ.45 లక్షల మోసం.. ప్రేమగా మాట్లాడే ఇందుష ఎన్నిసార్లు కోరినా రాదే!
Comments
Please login to add a commentAdd a comment