ఆడపిల్లలు పుట్టడమే దురదృష్టం అనుకుంటూ గర్భంలోనే శిశువులను చంపుతున్న రోజులివి. సమాజంలో లింగ వివక్ష వేళ్లూనుకుపోయింది. ఆడబిడ్డలని తెలిసి.. వారిని గర్భంలోనే చిదిమేసే వారు కొందరైతే.. పుట్టిన తర్వాత పెంట కుప్పల్లో.. నదుల్లో.. విసిరేసే వారు మరికొందరు. ఇక పల్లెల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఆడపిల్ల అంటే మన ఇంటి పిల్ల కాదని.. మగ పిల్లవాడిని కంటే వాడు వృద్దాప్యంలో తోడుంటాడని చాలా మంది అనుకుంటారు. విద్య, అధునాతన సదుపాయాలు పెరిగినా.. ఆ వివక్ష పోవడం లేదు. బేటి బచావో లాంటి కార్యక్రమాలు ఎన్ని వస్తున్నా.. ఆచరణలో అవి అంతంత మాత్రమే అమలవుతున్నాయి. ఆడపిల్లపై ఇంత వివక్షత ఎదురవుతున్న ఈ తరణంలో ఆడపిల్లలు పుడితే కంటి కద్దుకుంటున్నారు ఓ గ్రామస్తులు. వారి పుట్టుకను ఒక పండుగల జరుపుతున్నారు. అదెక్కడో కాదు.. మన తెలంగాణలోనే.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన నగరమైన సంగారెడ్డి (ప్రస్తుతం ఇది జిల్లా కేంద్రం) జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పుర్ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరు ఊరంతా పండుగలా జరపుకుంటున్నారు. ఈ పద్దతి గతేడాది నుంచే ప్రారంభమైంది. 1 జనవరి 2020లో మొదలవ్వగా అప్పటి నుంచి ఊరిలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే.. ఊరంతా లైట్స్ ఏర్పాట్లు చేసి.. దుస్తులు, స్వీట్స్ పంచుకుంటారు. పుట్టిన పాప పేరు మీద రూ. 1,000 ల చెక్కు అందజేస్తారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్. సుకన్య సమృద్ధి పథకం కింద వెయ్యి రూపాయల జమ చేస్తున్నారు గ్రామస్తులు. 10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై సుకన్య సమృద్ధి అంకౌంట్లను ప్రారంభించారు ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్న వారికి ఈ ఊరు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆడబిడ్డ పుడితే ఆ ఊరంతా సంబురమే!
Published Fri, Feb 19 2021 1:37 PM | Last Updated on Fri, Feb 19 2021 6:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment