మంత్రి కేటీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న డాక్టర్‌జి.నాగేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యవిద్యలోకి అడుగుపెడుతున్న మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నా ఉన్నతవిద్యలో తగ్గుముఖం పడుతోందని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఆవరణలో ‘వుమెన్ ఇన్ మెడిసిన్’అన్న అంశంపై ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
వైద్యరంగంలో రాణించిన మహిళలు ఎందరో ఉన్నారని, దేశంలో తొలి మహిళాడాక్టర్ ఆనందిబెన్, కేన్సర్ నిపుణురాలు డాక్టర్ వి.శాంత తదితరులను ఉదహరించారు. కోవిడ్ కష్టకాలంలో భారత్‌లో తయారైన మూడు టీకాల్లో రెండింటికి మహిళలే నేతృత్వం (సుచిత్రా ఎల్లా, మహిమ దాట్ల) వహించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల వైద్యులు డాక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment