
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రహదారులు, పేవ్‌మెంట్లపై విగ్రహాలు ప్రతిష్టిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎక్కడైనా విగ్రహాలు ప్రతిష్టించినట్లు తమ దృష్టికి వస్తే సుమోటోగా కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాస నం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జా రీచేసింది. అడ్డగోలుగా విగ్రహాలను ప్రతిష్టిస్తు న్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదం టూ వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ము న్సిపల్, ఆర్‌అండ్‌బీ, హోంశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment