చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈటల. చిత్రంలో కోదండరాం. మధుయాష్కీ తదితరులు.
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించా లని అఖిలపక్ష నేతలు, రిటైర్డ్ ఇంజనీర్లు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భారీ ఇంజ నీరింగ్ తప్పిదమని, భవిష్యత్తులో వచ్చే వరదలను సరిగ్గా అంచనా వేయకుండానే ప్రాజెక్టును డిజైన్ చేశారని విమర్శించారు. ‘కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా–ప్రకృతి వైపరీత్యమా’ అనే అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఎస్, ఆప్ నేతలు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడారు.
పంపులు నీటమునగడానికి సీఎం కేసీఆర్‌యే బాధ్యుడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మేఘాలు బద్దలు (క్లౌడ్ బరస్ట్) కాలేదు.. అవినీతి బద్ధలైందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, మానవ తప్పిదానికి ప్రకృతి వైపరీత్యం తోడుకావడంతో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు నీటముని గాయని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు. నీట మునిగిన పంప్‌హౌస్‌లకు రక్షణగా మట్టికరకట్టలు నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇది మానవతప్పిదమే’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కోదండరాం, సీపీఐ నేతలు జయసార«థి, పశ్యపద్మ, ఆప్ నేత ఇందిరా శోభన్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment