![Telangana Tenth Class Exam Schedule Will Come On December 28th - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/27/10th-exams.jpg.webp?itok=oCTWw9kM)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ అధికారుల బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి మార్చి రెండు లేదా మూడో వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోది. ఈ మేరకు పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన.. ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, సంబంధిత ఇతర అధికారులతో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వేంకటేశం సమావేశం నిర్వహించారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమయాశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. పదో తరగతి పరిక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. సీఎంతో భేటీ అనంతరం పరీక్షల షెడ్యుల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో నేడు లేదా రేపు(గురువారం) ఈ రోజు లేదా రేపు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
చదవండి: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment