సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అదేరోజు 120 రూపాయలు ఉన్న డేపాస్...కేవలం 75 రూపాయలకే అందించాలని నిర్ణయించారు.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 75 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు రెగ్యులర్‌గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్‌ను అందజేస్తామని చెప్పారు.
విమానాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆగస్టు 15న 75శాతం ఛార్జీలనే వసూలు చేస్తారు. అలాగే 18వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించి 7 వేల 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు మందులను అందించనున్నారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారికి 750 రూపాయలకే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు.
చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment