Vanajeevi Ramaiah 80th Birthday: Planted 80 Kilos Seeds Details Here - Sakshi
Sakshi News home page

Vanajeevi Ramaiah Birthday: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు

Published Sat, Jul 2 2022 3:18 PM | Last Updated on Sat, Jul 2 2022 4:08 PM

Vanajeevi Ramaiah 80th Birthday: Planted 80 Kilos Seeds - Sakshi

ఖమ్మం రూరల్‌: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన 80వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం 80 కేజీల విత్తనాలను నాటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రూరల్‌ మండలం, కొణిజర్ల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విత్తనాలు నాటి మాట్లాడారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతో పాటు మొక్కను బతికించినప్పుడే అందుకు తగిన ప్రతిఫలం వస్తుందని తెలిపారు. తద్వారా రాబోయే తరాలకు మేలు చేసిన వారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో రామయ్య అభిమాను లు పాల్గొన్నారు. (చదవండి: బియ్యంపై కయ్యం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement