సాక్షి, కరీంనగర్: అమెరికా అధ్యక్షుడిగా కొలువుదీరనున్న జో బైడెన్ టీమ్‌లో తెలంగాణ మూలాలున్న వ్యక్తికి చోటుదక్కింది. బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా చొల్లేటి వినయ్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన మూలాలున్న పోతిరెడ్డిపేటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతులు 1970లో అమెరికా వెళ్లారు.
నారాయణరెడ్డి అక్కడే డాక్టర్‌గా స్థిరపడగా, ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన వినయ్‌రెడ్డి వైట్‌హౌస్‌లో బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికాలోని ఒహియా రాష్ట్రం డేటన్‌లో పుట్టి పెరిగిన వినయ్‌రెడ్డి కేజీ నుంచి డిగ్రీ వరకు ఒహియాలోనే చదువుకున్నారు. మియామి విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద విద్యలో పట్టా పొందారు. వినయ్‌రెడ్డి.. అమెరికా ఎన్నికల్లో బైడెన్–హ్యారిస్ ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారుగా, ప్రసంగ రచయితగా పనిచేసిన అనుభవం ఉంది. చదవండి: (యూఎస్‌లో రెండు బిగ్ ‘డే’లు.. అందులో ఒకటి నేడే!)
కుటుంబ నేపథ్యం ఇదీ..: చొల్లేటి వినయ్‌రెడ్డి తాత తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపేట గ్రామానికి 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. వినయ్‌రెడ్డి తం డ్రి నారాయణరెడ్డి అమెరికా వెళ్లి డాక్టర్‌గా స్థిరపడ్డారు. పోతిరెడ్డిపేటలో వీరికి సొంతిల్లు, ఐదెకరాల పొలం ఉన్నాయి. నారాయణరెడ్డితోపాటు కుటుంబసభ్యులు సొంత గ్రామమైన పోతిరెడ్డిపేటకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. చదవండి: (బైడెన్ కర్తవ్యాలు)
Comments
Please login to add a commentAdd a comment