
గొడ్డలి పట్టుకొని ఉన్న కిరణ్‌కుమార్, డైరెక్టర్ సుకుమార్‌తో
సాక్షి, వరంగల్: అతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నటనపై ఉన్న ఆసక్తితో పై చదువులు చదువకుండా.. యాక్టింగ్‌లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మిమిక్రీ, మ్యాజిక్ మైమ్‌లో డిప్లామా చేశాడు. అతడి అంకితభావం, ఆసక్తి, కఠోర సాధనకు ఫలితం దక్కింది.
టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సెన్సేషన్ కాంబినేషన్‌లో వస్తోన్న పుష్ప సినిమాలో నటించే అవకాశం మండలంలోని నిడిగొండ గ్రామానికి చెందిన బిర్రు కిరణ్‌కుమార్‌కు దక్కింది.
తాజాగా విడుదలైన పుష్ప ట్రైలర్‌లో అల్లు అర్జున్ పక్కన కిరణ్‌కుమార్ చేతిలో గొడ్డలిపట్టుకొని నిలబడ్డాడు. ఈ ఫొటో ఇప్పుడు జిల్లా, మండలంలోని వివిధ వాట్సప్ గ్రూపులో వైరల్‌గా మారింది.
చదవండి:
బాలీవుడ్‌లో పుష్ప నటుడి తెరంగ్రేటం..!
సమంత ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది