రేసు కుక్క.. పెరిగిన లెక్క  | Wild Dogs Steadily Increasing In Forest Area Of Medak District | Sakshi
Sakshi News home page

రేసు కుక్క.. పెరిగిన లెక్క 

Published Tue, Apr 12 2022 4:53 AM | Last Updated on Tue, Apr 12 2022 3:08 PM

Wild Dogs Steadily Increasing In Forest Area Of Medak District - Sakshi

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లాలోని అటవీప్రాంతంలో వైల్డ్‌డాగ్స్‌ (రేసు కుక్కలు) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పదులలో ఉన్న రేసుకుక్కల సంఖ్య ఈ రెండేళ్లలో రెండు వందలకుపైగా పెరిగింది. ఈ మేరకు రామాయంపేట, నర్సాపూర్, పోచారం అభయారణ్యం పరిధిలో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

రేసుకుక్కలు గుంపులుగా సంచరిస్తాయని, ఒక్కో గుంపులో కనీసం ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉంటాయని అధికారులు అంటున్నారు. వీటి దాడి భయానకంగా, వేటాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని, వీటి బారిన పడిన ఏ జంతువైనా బతకడం అసాధ్యమని చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement