సాక్షి, నల్లగొండ: వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు లోటస్‌పాండ్ నుంచి నల్లగొండ జిల్లా పర్యటనకు షర్మిల బయల్దేరనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నీలకంఠ సాయి, అతడి కుటుంబాన్ని 10:30 గంటలకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు హుజూర్‌నగర్ సర్కిల్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో కరోనాతో మృతి చెందిన వైఎస్‌ఆర్ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు, మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు.
చదవండి: రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్‌లతో చికిత్స..
Comments
Please login to add a commentAdd a comment