
గోశాల ప్రారంభోత్సవంలో చినజీయర్‌స్వామి, మంత్రి కాకాణి గోవర్ధరెడ్డి తదితరులు
కలువాయి : చినజీయర్ స్వామి ఆదర్శనీయులని, రూ.వెయ్యికోట్లతో సమతామూర్తి విగ్రహం నిర్మించి ప్రపంచానికే ఆధ్యాత్మిక నిర్దేశం చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కొనియాడారు. మండలంలోని రాజుపాళెంలో ఉన్న పరమానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన గోశాలను చినజీయర్‌స్వామితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చినజీయర్ బోధనలు, ప్రవచనాలు, ప్రసంగాలు మానవాళి మనుగడకు ఉపయోగకరమన్నారు. పరమానంద ఆశ్రమాన్ని చినజీయర్ ట్రస్ట్‌లో విలీనం చేయడం శుభపరిణామని తెలిపారు. చినజీయర్‌స్వామి మహాశక్తిసంపన్నులని, వారి ఆశీస్సులు తనతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా ఉండాలని కోరారు. గోశాల దాతలు ఆమర్తలూరు వెంకటేశ్వర్లు, శైలజ, ఆమర్తలూరు మణికంఠ, జయశ్రీ దంపతులను అభినందించారు.
పట్టు వస్త్రాల సమర్పణ
ఆశ్రమం ఆవరణలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్ రెడ్డి, సెంట్రల్‌బ్యాంక్ మాజీ చైర్మన్ వేనాటి శ్యాంసుందర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తా..
ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. కలువాయి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్ రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై వెంటనే స్పందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్.లక్ష్మీదేవి, ఉపాధ్యక్షుడు పంగా పెంచలనరసారెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment