భూమ్మీద జీవకోటికి చల్లని వెలుగునిచ్చే నెలరాజుతో జతకట్టాలని.. జాబిల్లిపై ఉన్న రహస్యాలు ఛేదించాలని.. ‘మామ’గుట్టును విశ్వవ్యాప్తం చేయాలని.. ఉవ్విళ్లూరుతూ రివ్వున ఎగిరిపోయిన చంద్రయాన్–3 మిషన్ ప్రయోగ మొదటి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. రాకెట్‌లో అమర్చిన పరికరాలు భూ స్థిర నిర్ణీత కక్ష్యలో ఆహ్లాదకర వాతావరణంలో విహరిస్తున్నాయి. తదుపరి రెండో ఘట్టంలో 17 రోజుల పాటు చంద్రుడివైపు పయనించి చంద్రుని కక్ష్యలోకి చేరనున్నాయి. ఆగస్టు 23న అసలుశిసలైన మూడో ఘట్టానికి తెరలేపనున్నాయి. చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4 గంటల తర్వాత రోవర్ బయటకొచ్చి తన పరిశోధన మొదలు పెట్టనుంది. ఈ రెండు ప్రక్రియలు పూర్తయితే ప్రపంచ పటంలో భారత్ శిఖరాగ్రన నిలవనుంది. – సూళ్లూరుపేట
Comments
Please login to add a commentAdd a comment