హోంమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం
వరదయ్యపాళెం : శాసన మండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నా మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాపై మాట్లాడే నైతిక హక్కు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదన్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తొలగించేందుకు కుట్రలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల నైపుణ్యతను పెంచేందుకు ఇంగ్లిష్ మీడియం అవసరమని తెలిపారు. అందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుచూపుతో సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని వెల్లడించారు. దీనిపై అప్పట్లో ఎల్లోమీడియా తెలుగు భాషాను నిర్వీర్యం చేస్తున్నట్లు బురదచల్లిందని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ మాధవరావుపై హోంమంత్రి చేసిన ఆరోపణలు సరికాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment