రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్ధ.. మేనిఫెస్టోపై లేదా?
సత్యవేడు: రెడ్‌బుక్‌పై పెట్టిన శ్రద్ధ ఎల్లో మేనిఫెస్టోపై ఎందుకు పెట్టడం లేదని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న నగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీసీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎప్పుడో ఐదేళ్లకు ముందు మాట్లాడారని, ఇప్పుడు మనోభావాలు దెబ్బతినాయని 311 కేసు పెట్టి ఆరోగ్యం సరిలేని పోసాని మురళీకృష్ణని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్‌మీట్‌లో మట్లాడితే దేశద్రోహం అవుతుందా.. అన్ని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ గురించి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎలా మాట్లాడారో అందరూ విన్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ వీళ్లపై కేసు పెడితే వీళ్లు బయటికి వస్తారా..? అన్ని ప్రశ్నించారు. నగిరిలో టిడీపీ కార్యకర్తలు వైఎస్పార్‌సీపీకి చెందిన దళిత యువకులపై దాడిచేసి, వారి బైకులను తగలబెట్టి మళ్లీ వారిపైనే కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి సీఐ, డీఎస్పీ వైఎస్సార్‌సీపీ దళిత నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు పెట్టి వారిని రిమాండ్‌కు పంపడం దారుణమన్నారు. ఎవరూ ఎదురు మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వైఎస్.జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దొంగదారిన పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళు గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు చేస్తున్నారన్నారు. ఇదేగనుక జగన్‌మోహన్‌రెడ్డి చేసి ఉంటే ఒక్క టీడీపీ కార్యకర్త, జనసేక కార్యకర్త రాష్టంలో బతకగలిగే వారా..? అని ప్రశ్నించారు. మాజీ సింగిల్ విండో అధ్యక్షడు కేవీ.నిరంజన్‌రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ బొప్పన సోమశేఖర్, సర్పంచ్ రమేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మస్తాణి వైఎస్సార్‌సీపీ టీయూసీ చైర్మన్ గోవిందస్వామి, శ్రీనివాసులురెడ్డి, పళణి, రాబర్టు, సురేష్, నగరి నాయకులు రామ్‌ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్ కన్నెప్ప, కౌన్సిలర్ బీడీ భాస్కర్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment