గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
రేణిగుంట: ఏర్పేడు మండలం, పాగాలి సమీపంలోని రాక్‌మ్యాన్ పరిశ్రమ ప్రాంగణంలో సోమవారం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
లక్ష్యానికి తొలి అడుగు
స్వర్ణాంధ్ర విజన్–2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లకా్‌ష్య్‌నికి ఇది తొలిఅడుగు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలిగించడంతోపాటు ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన పాల్గొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment