ఆగమోక్తంగా ధ్వజావరోహణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆగయోక్తంగా నిర్వహించారు. ఉదయం వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంతోత్సవ మండపంలో కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం సూర్యపుష్కరణి వద్దకు త్రిశూలానికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు.
నేడు పల్లకీ సేవ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి పల్లకీ సేవ నిర్వహించనున్నారు.
ధ్వజావరోహణం సందర్భంగా విశేష పూజలు
ఆగమోక్తంగా ధ్వజావరోహణం
ఆగమోక్తంగా ధ్వజావరోహణం
Comments
Please login to add a commentAdd a comment