ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
విశాఖపట్నానికి శ్రీకాళహస్తి మెట్రో సర్వీసులు
● వాటి స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు ● వీటిల్లో టిక్కెట్ ధర రూ.70 ● లబోదిబో మంటున్న ప్రయాణికులు
తిరుపతి అర్బన్: ఆల్ట్రాడీలక్స్ వద్దు.. మెట్రో సర్వీసులే ముద్దు అని ప్రయాణికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు 22 మెట్రో సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ పెద్దలు వీటిని దశల వారీగా విశాఖపట్నానికి తరలించేస్తున్నారు. అక్కడ వాటిని టౌన్ సర్వీసులుగా తిప్పేందుకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించేశారు. మిగిలిన వాటిని రెండు, మూడు దశల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు.
మెట్రో స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు
మెట్రో స్థానంలో తిరుపతి డిపోలోని ఆల్ట్రా డీలక్స్‌లను శ్రీకాళహస్తి డిపోకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆరు సర్వీసులు తరలించారు. సాధారణంగా మెట్రో సర్వీసుల్లో టిక్కెట్ ధర రూ.55 ఉండగా.. అదే ఆల్ట్రాడీలక్స్‌లో రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లి రావడానికి రానుపోను రూ.140 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒకసారి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి పోయి రావాలంటే రూ.30 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది.
మెట్రో సర్వీసులే మేలు
తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లడానికి మెట్రో సర్వీసులు ఎంతో సౌకర్యంగా ఉండేవి. వాటినే కొనసాగించాలని కోరుతున్నాం. ఆల్ట్రాడీలక్స్‌ల్లో డ్రైవర్లే టిక్కెట్లు కొడుతున్నారు. ఆయన దృష్టి డ్రైవింగ్‌పైనే కాకుండా టిక్కెట్లపై ఉంటోంది. ఇది చాలా ప్రమాదకరం.
– రెడ్డెప్ప, ప్రయాణికుడు
భారం తగ్గించాలి
మెట్రో సర్వీసులను తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రద్దు చేసి... ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా రానుపోను రూ.30 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రయాణికులపై భారం తగ్గించాల్సి ఉంది.
– వినోద్‌రెడ్డి, ప్రయాణికుడు
సౌకర్యవంతంగా ఆల్ట్రాడీలక్స్‌లు
తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీ సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయ ని భావిస్తున్నాం. అందుకే ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించాం. ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్‌లను ఏర్పాటు చేశాం. మెట్రోతో పోల్చుకుంటే టిక్కెట్ ధరపై రూ.15 మాత్రమే అదనం.
– నరసింహులు, జిల్లా ప్రజారవాణా అధికారి
ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
Comments
Please login to add a commentAdd a comment