పోలీస్ గ్రీవెన్స్‌కు 110 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 110 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌న్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
పుస్తకోత్సవం ప్రారంభం
తిరుపతి సిటీ:ఎస్వీయూ కేంద్రీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తకోత్సవం పేరుతో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సోమవారం వర్సిటీ వీసీ అప్పారావు పుస్తక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. పుస్తకం ఒక నేస్తం అని, ప్రస్తుతం పుస్తక పఠనం గణనీయంగా పడిపోవడం బాధాకరమైన అంశమన్నారు. కేంద్రీయ గ్రంథాలయాధిపతి ఆచార్య సురేష్‌బాబు మాట్లాడుతూ దేశవిదేశాలలో లభించే గ్రంథాలను ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. డీన్ ఆచార్య ఎన్‌సీ రాయుడు, అధ్యాపకులు డాక్టర్ రంగనాథ్, కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ అదనపు లోడ్
క్రమబద్ధీకరణపై రాయితీ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణపై గృహ వినియోగదారులకు 50 శాతం డిస్కౌంట్ ప్రభుత్వం ప్రకటించిందని ట్రాన్స్‌కో తిరుపతి, చిత్తూరు ఎస్‌ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. తిరుపతి జిల్లాలో 7.95 లక్షల మంది, చిత్తూరు జిల్లాలో దాదాపు 4.37 లక్షల మంది కలిపి మొత్తం 12.32 లక్షల మంది సర్వీసులను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. సాధారణ రోజుల్లో కిలో వాట్‌కు రూ.2 వేలు క్రమబద్ధీకరణ రుసుం చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1000 చెల్లిస్తే చాలన్నారు. జూన్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటిని ఏపీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్ లేదా సంబంధిత విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రంలో చెల్లించవచ్చన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 110 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment