
ఆశలు.. ఆకాంక్షలు!
బడ్జెట్‌పై ఆశగా ఎదురుచూపు
● వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలంటున్న రైతులు ● అభివృద్ధి, సంక్షేమానికి సమానంగా నిధులు కేటాయించాలి ● జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి ● సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి ● నేడు పయ్యావుల బడ్జెట్‌పై ఆత్రుతగా ఎదురు చూస్తున్న జిల్లా ప్రజలు
తిరుపతి సిటీ: జిల్లాలో అభివృద్ధి ఊసేలేదు. సంక్షేమం పడకేసింది. గత తొమ్మిది నెలలుగా జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలు కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. కక్ష్యసాధింపు చర్యలు తప్ప జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించలేదంటూ విమర్శిలు ఎక్కుపెడుతున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనీసం 20శాతం కూడా అమలు చేయకపోవడంతో నిపుణులు, మేధావులు పెదవి విరుస్తున్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టే బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి, వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గత బడ్జెట్‌ను నీరుగార్చారు
కూటమి ప్రభుత్వం 2024–25లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంది. రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందించేందుకు రూ.4,500 కోట్లు, కౌలు రైతులకు రూ.20 వేలు ఇస్తామని, రూ.1000కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆపై వాటిని అమలు చేయలేదు. తల్లికి వందనం పథకానికి గత బడ్జెట్‌లో రూ.6,487 కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది 2025–26 బడ్జెట్‌లోనైనా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తారా.. లేదోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment