
కన్నప్ప కొండపై క్షుద్రపూజల కలకలం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కన్నప్ప కొండపై బుధవారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని కొండమీద ప్రతిష్టించిన శివలింగం వద్ద తమిళనాడుకు చెందిన ఓ అఘోరా విచిత్ర పూజలు నిర్వహించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. అఘోరా లాగా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి తల మీద నిమ్మకాయ, దానిపైన కర్పూరం వెలిగించుకుని మంత్రోచ్ఛారణలు చేస్తూ పూజలు చేశాడు. శివలింగం ముందు అనేక నిమ్మకాయలను నక్షత్రం లాగా పెట్టి మధ్యలో కర్పూరాలు వెలిగిస్తూ ఏదో మంత్రాలు చదువుతూ పూజలు చేయడం భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ ఎవరూ ఆ అఘోరాను ప్రశ్నించలేదు. అక్కడ ఉన్న భక్తులే అఘోరాను ప్రశ్నించారు. తమిళనాడు నుంచి వచ్చానని అఘోరా భక్తులకు చెప్పాడు.
పదవీయోగం సిద్ధిస్తుందనీ!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయం వద్ద అనేక మంది భక్తులు జాగరణ చేస్తుండగా ఓ వ్యక్తి కన్నప్ప కొండమీద శివలింగం వద్ద ఈ విధమైన పూజలు నిర్వహిస్తుంటే అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పాలకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

కన్నప్ప కొండపై క్షుద్రపూజల కలకలం
Comments
Please login to add a commentAdd a comment