ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న మినీ వ్యాన్
– అక్కడికక్కడే డ్రైవర్ మృతి
గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని జాతీయ రమదారి, ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ కథనం.. తమిళనాడు ఊతుకోటకు చెందిన వెంకటేషన్(45) మినీ వ్యాన్ డ్రైవర్. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వస్తున్న సమయంలో ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ట్రాలీని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. మినీ వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జుయ్యింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
తిరుపతి సిటీ: స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్‌లోని శ్రీవేంకటేశ్వర అకాడమీలో డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గీతాంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శనివారం అకాడమీలో జరగనున్న డెమో క్లాస్‌కు హాజరు కావాలని కోరారు. వివరాలకు 8179392526, 6303285971 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు
తిరుపతి అర్బన్: ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కెనరా బ్యాంక్ తిరుపతి జనరల్ మేనేజర్ పాండురంగ మితంతాయ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని ఎంఆర్‌పల్లి లక్ష్మీనగర్‌లో నూతనంగా నిర్మించిన కెనరా బ్యాంక్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ నుంచి అన్నిరకాల రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. తిరుపతి రీజనల్ ఆఫీస్ ఏజీఎం నాగరాజరావు, డివిజన్ల మేనేజర్లు శ్రవణ్‌కుమార్, సువర్ణకృష్ణ, హర్ష, స్వాతి పాల్గొన్నారు.
ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న మినీ వ్యాన్
Comments
Please login to add a commentAdd a comment