
ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేయాలి
ఆరోగ్యశ్రీకి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించాలి. బకాయిల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆదుకోవాలి. గత ఏడాదిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రజరుగుతున్నట్లు వార్తలు రావడం బాధాకరం. పేదల ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం భరోసా కల్పించాలి. గతంలో ఆరోగ్యశ్రీతో మా కుటుంబానికి రూ.3లక్షల మేర లబ్ధి చేకూరింది. నా భర్త ప్రాణాలను కాపాడింది. అలాంటి పథకాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలి.
–కే స్రవంతి, గృహిణి, తిరుపతి రూరల్
తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వాలి
కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తున్నా ఆ ఊసేలేదు. రెండేళ్లకు సంబంధించి తల్లికి వందనం నగదు ఇవ్వాలి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించాలి. –ప్రమీల, చిరువ్యాపారి, తిరుపతి
సూపర్‌సిక్స్ హామీలు
అమలు చేయాలి
జిల్లాలో సంక్షేమ పథకా ల ఊసేలేదు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల ను నెరవేర్చేందుకు 2025 –26బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ఇప్పటికే ఏడాది పాలన గడచినా సూపర్‌సిక్స్ అమలుపై ప్రభుత్వం నోరు మెదపలేదు. – ఎల్‌ఎస్ లక్ష్మీ,
ఎఐఎంఎస్ మహిళా సంఘం, తిరుపతి

ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేయాలి

ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేయాలి
Comments
Please login to add a commentAdd a comment