
మహిళల నిరసన
మద్యం షాపు ఏర్పాటుపై
బుచ్చినాయుడుకండ్రిగ:మండలంలో నిబంధనలకు విరుద్ధంగా చల్లమాంబపురంగ్రామంలో మద్యం షాపు ను ఏర్పాటు చేయడంపై శనివారం మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మంలోని ఇళ్లమధ్యలో మద్యం షాపును ఏర్పాటు చేయ డంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. గ్రామంలోని రోడ్డు పక్కనే మద్యం షాపు పెట్టడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి గొడవ చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మణినాయుడు హెచ్చరించారు.
అనధికార పర్మిట్ షాపులో విచ్చలవిడిగా మద్యం
మండలంలోని చల్లమాంబపురం గ్రామంలోని మద్యం దుకాణం పక్కనే ఉన్న అనధికార పర్మిట్ షాపులో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మద్యం షాపు మూత వేసిన సమయంలో అనధికార పర్మిట్ షాపులో ఉదయం 5 నుంచి మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు.
ఆడబిడ్డలున్నారు.. మద్యం దుకాణం పెట్టొద్దు!
తిరుపతి రూరల్: ‘కాలేజీలకు వెళ్లే ఆడబిడ్డలున్నారు.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ మార్గం గుండానే తిరుగుతుంటారు.. మద్యం మత్తులో మందుబాబులు వల్ల ఇబ్బందులు వస్తాయి.. దయచేసి ఇక్కడ మద్యం దుకాణం పెట్టకండి..’ అంటూ తిరుపతి రూరల్ మండలం, లింగేశ్వరనగర్, అవిలాల గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆ దుకాణం వద్దకు బాలికలను తీసుకువెళ్లి దుకాణం ముందు కూర్చోబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గతంలో చికెన్ సెంటర్‌గా ఉన్న దుకాణాన్ని మద్యం అమ్మకాల కోసం ఏర్పాట్లు చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. అయినప్పటికీ మద్యం వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా దుకాణంలోకి మద్యం బాటిళ్లను చేర్చడంతో దుకాణం ప్రారంభిస్తే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు దుకాణ దారులకు తెలిపారు.

మహిళల నిరసన
Comments
Please login to add a commentAdd a comment