
కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు
తిరుపతి మంగళం : ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ విధమైన సాయం చేయకూడదని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు చెప్పడం సిగ్గుచేటని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీల మధ్య పోటీ ఉండాలే తప్ప ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా పాలన సాగించాలన్నారు. కానీ చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో టీడీపీ నాయకులకే ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చావా? చంద్రబాబూ అని ప్రశ్నించారు. జగనన్న పాలనలో రూ.2.5లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పేదప్రజలకు అందించారని గుర్తుచేశారు. పేదలకు మంచి చేశారు కాబట్టే గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు జగనన్నకు వేశారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా సంపద సృష్టించలేకపోతున్నానంటూ మరోసారి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌లు రెడ్‌బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషయల్ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అరాచకాలు, దౌర్జన్యాలను గ్రహిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గ్రీన్ చానల్ ద్వారా
గుండె తరలింపు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం విమానంలో చేరుకున్న గుండెను అంబులెన్‌న్స్‌లో గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి పద్మావతి హృదయాలయానికి తరలించారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు
Comments
Please login to add a commentAdd a comment