
వైభవం.. గిరి ప్రదక్షిణం
● ఘనంగా కొండచుట్టు మహోత్సవం – సమస్త దేవగణాలకు వీడ్కోలు పలికిన పార్వతీపరమేశ్వరులు ● ఎదురుసేవలో ఆదిదంపతులకు స్వాగతం పలికిన భక్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్ఞానప్రసూనానాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి కై లాస గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతా గణాలు, రుషులకు పార్వతీ పరమేశ్వరులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చప్పరాలపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. భేరివారి మండపం వద్ద భేరికులస్తులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావువీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కై లాసగిరికాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీ మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. అంజూరు మండపంలో ఆదిదంపతులు కాసేపు సేదతీరారు. అనంతరం వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. రాత్రి ఆదిదంపతులను అశ్వ, సింహ వాహనాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. గిరిప్రదక్షిణ ఉభయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఉత్సవానికి ఉభయకర్తగా వ్యవహరించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు.
కూటమి నేతల కోరల్లో చిక్కి స్వర్ణమ్మ విలవిల్లాడుతోంది. ఇష్టారాజ్యంగా జేసీబీలతో ఇసుక తవ్వేస్తుంటే గర్భశోకంతో కన్నీరుపెడుతోంది. తమ్ముళ్ల ధన దాహం తీర్చలేక కొట్టుమిట్టాడుతోంది. పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మౌనంగా రోదిస్తోంది. సహజంగా ఏర్పడిన మేటలు మాయమవుతుంటే చేసేదిలేక దిగాలు పడుతోంది. నిలువెత్తు గుంతలను చూసుకుంటూ కుమిలిపోతోంది. అక్రమార్జనే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఇసుకాసురుల వికటాట్టహాసంతో భయాందోళన చెందుతోంది.
స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు

వైభవం.. గిరి ప్రదక్షిణం

వైభవం.. గిరి ప్రదక్షిణం

వైభవం.. గిరి ప్రదక్షిణం
Comments
Please login to add a commentAdd a comment