గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
తడ:చైన్నెకి గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకష్ణ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి బ్యాగులను తనిఖీ చేస్తే గంజాయి పట్టుబడినట్టు వివరించారు. దాడి లో ఎస్‌ఐ కొండపనాయుడు, సిబ్బంది ఉన్నారు.
కడూరులో
కార్గో ఎయిర్‌పోర్టు?
తడ : శ్రీసిటీ పారిశ్రామికవాడ, మాంబట్టు, మేనకూరు ఏపీఐఐసీ సెజ్‌లతోపాటు షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అందుబాటుగా వరదయ్యపాళెం మండలం కడూరు వద్ద కార్గో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సుమారు 400 ఎకరాలను వరదయ్యపాళెం, సత్యవేడు, తడ మండలాల్లోని భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అటవీ భూములను విమానాశ్రయానికి కేటాయించేందుకు ఫారెస్ట్ శాఖ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తడ నుంచి శ్రీకాళహస్తి వెళ్లే రహదారి విస్తరణకు సైతం అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment