
మహిళా వర్సిటీ విద్యార్థులకు అభినందనలు
నేటి నుంచి ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్
తిరుపతి సిటీ: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ ఉద్యోగుల మధ్య క్రీడాస్పూర్తిని, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో తిరుపతి వేదికగా ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతోష్ నేతా వెల్లడించారు. ఆయన ఆదివారం తిరుపతి డివిజనల్ పోస్టాఫీసులో విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తిరుపతి మున్సిపల్ రోడ్డులోని స్మార్ట్ సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం నుంచి 7వ తేదీ వరకు క్యారమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో 13 రాష్ట్రాల పోస్టల్ సర్కిల్స్ నుంచి 108 మంది పురుషులు, మహిళా ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. 7వ తేదీన జరిగే ఫైనల్‌లో విజేతలకు ట్రోఫీని అందజేస్తామని, ప్రతిభ చూపిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం టోర్నమెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో తిరుపతి డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ బి.నరసప్ప, కర్నూల్ డివిజన్ ఏడీ వెంకటరెడ్డి, విజయవాడ సర్కిల్ డీఎస్‌వీఆర్ మూర్తి, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment