
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
దయాగుణంతో ‘దీక్ష’
తిరుపతి కల్చరల్ : నెలవంక దర్శనంతో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని, ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ దయాగుణం చాటాలని ప్రభుత్వ ఖాజా సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం కాద్రి పీఠంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసంలో ప్రతి క్షణం దివ్యమని, ప్రతి ఒక్కరూ అల్లాహ్‌ను స్మరిస్తూ ప్రార్థన చేయాలని కోరారు. మార్చి 2 నుంచి నిరంతరం 30 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించాలని సూచించారు. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉపవాస దీక్ష సంకల్పించి ప్రత్యేక ప్రార్థన(తాహజాత్) చేయడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష(ఇఫ్తార్)తో విరమించాలని తెలిపారు. ఏకాగ్రతతో ఖురాన్ గ్రంఽథం చదవాలని, లేదా వినాలని చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఒక్కటైన ‘జకాత్’ చేపట్టాలని, సమాజ శ్రేయస్సు కోసం ముస్లింలు దాన ధర్మాలు చేయాలని తెలిపారు. రాత్రి వేళ ‘తరావీ’ నమాజు తప్పక చదవాలని కోరారు. దేశ సమైక్యత, ప్రపంచ శాంతి, భద్రత కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు.
8 నుంచి
తుడా టవర్స్ ఈ– వేలం
తిరుపతి తుడా : తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్లను ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ–వేలం వేయనున్నట్లు తుడా వైస్ చైర్మన్ మౌర్య తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రూ.345కోట్ల అంచనా వ్యయంతో జీప్లస్ 13 భవనం నిర్మిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు. 2026 ఏప్రిల్ నాటికి మొత్తం భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నివాస గృహాలకు సంబంధించి 2వ అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు డబుల్ బెడ్‌రూం ప్లాట్లు 46, త్రిబుల్‌బెడ్ రూమ్–152, నాలుగు బెడ్‌రూమ్ – 32 వెరసి మొత్తం 230 నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగేస్విమ్మింగ్ పూల్, జిమ్, షటిల్ కోర్టు, ల్యాండ్ స్కేపింగ్ పోడియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్ వంటి ఆధునిక సౌక్యరాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు ఈ–వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ్ట udaap.in.tudaotwerr.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment