రెచ్చిపోయిన మట్టి మాఫియా
రామచంద్రాపురం: మండలంలోని కమ్మపల్లెలో ఆదివారం మట్టి మాఫియా రెచ్చిపోయింది. స్థానిక సిద్ధేశ్వర ఎస్టీ కాలనీవాసులపై దాడికి తెగబడింది. వివరాలు.. రావిళ్ల వారిపల్లెలోని సర్వే నంబరు 233లో ధనలక్ష్మీ స్టోన్ క్రషర్ నిర్వాహకుడు సురేష్ రెడ్డి 2017లో క్వారీ నిర్వహణకు అధికారికంగా అనుమతులు పొందారు. గడువు ముగిసిన తర్వాత సురేష్ రెడ్డి తన భార్య గౌరి పేరు మీద అదే సర్వే నంబరులో నకిలీ స్కెచ్‌లను తయారు చేసుకుని అధికారుల ఆమోదం తీసుకున్నారు. డమ్మీ స్కెచ్‌లను ఆధారంగా చేసుకుని గనుల శాఖ అధికారులతో కుమ్మకై ్క నకిలీ అనుమతులతో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మట్టి తరలించే లారీలను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన వారిపై దాడి చేశారు. రామచంద్రాపురం పోలీసులు గ్రామానికి చేరుకుని మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను అక్కడ నుంచి పంపించేశారు. మట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని సురేష్ రెడ్డికి సూచించారు. దీంతో గ్రామస్తులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment