
కారు ఢీకొని ఒకరి మృతి
– మరొకరికి గాయాలు
గూడూరురూరల్ : మండలంలోని చెన్నూరు వద్ద ఆదివారం ఉదయం కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గ్రామంలోని కాపువీధి చెందిన అల్లూరు మురళీరెడ్డి(58), శీకిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి ప్రతిరోజూ ఉదయం వాకింగ్‌కు వెళుతుంటారు. ఈ క్రమంలోనే వ్యాహ్యాళికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా వెంకటగిరి నుంచి గూడూరు వైపునకు వస్తున్న కారు ఢీకొంది. దీంతో మురళీరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన రామ్మోహన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్‌ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార. మురళీరెడ్డి మృతితో చెన్నూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
మహిళకు గాయాలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట సమీపంలోని మర్రిగుంట సర్కిల్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ప్రకాశం జిల్లా నుంచి వస్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని 108లో ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

కారు ఢీకొని ఒకరి మృతి

కారు ఢీకొని ఒకరి మృతి
Comments
Please login to add a commentAdd a comment