
సీఎంకు సాదర స్వాగతం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్):చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన హెలికాప్టర్లో జీడీ నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకు ని తిరుగుపయనమయ్యారు. స్వాగతం పలికిన వారిలో అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.
గుడిమల్లం ఆలయంలో హుండీ చోరీ
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయంలో అమ్మవారి వద్ద ఉన్న హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఓ పక్క శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నా.. హుండీ చోరీ కావడం విశేషం. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి హుండీ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన ఆలయాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరి పంట పరిశీలన
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మండలంలోని గాజులమండ్యం గ్రామ పొలాల్లో ఈ క్రాప్‌లో గ్రామ వ్యవసాయ సహాయకులు నమో దు చేసిన పంటలను శనివారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్క రైతు తాము సాగుచేస్తున్న పంటలను వ్యవసాయ అధికారుల సహకారంతో పంట నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.

సీఎంకు సాదర స్వాగతం
Comments
Please login to add a commentAdd a comment