
శ్రీసిటీలో షార్ స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్
శ్రీసిటీ (వరదయ్యపాళెం): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీలో షార్ స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీసిటీ, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను శుక్ర, శనివారాల్లో సాగింది. ట్రిపుల్ ఐటీ, క్రియా విశ్వవిద్యాలయం, అకార్డ్, చిన్మయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం నుంచి తాజా పురోగతి వరకు వివిధ ప్రయోగాలు, లాంచ్ ప్యాడ్‌లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లు తదితర నమూనాలను ప్రదర్శించారు. సంక్లిష్టమైన అంతరిక్ష సాంకేతికతను వివరించడంతో పాటు సైన్స్ సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచే రీతిలో విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన షార్ డైరెక్టర్ రాజరాజన్‌కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment