
స్టైఫండ్ పెంచాల్సిందే
తిరుపతి కల్చరల్: ఎస్వీ వెటర్నరీ విద్యార్థులకు ఇతర వైద్య కోర్సుల విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ రూ.25 వేలకు పెంచాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో శనివారం పశువైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నేత ఓబుల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ వ్యవస్థాపకుడు సుందర్‌రాజ, బీసీ విద్యార్థి విభాగం నేత తిరుమలేష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లోకేష్, ఐక్య విద్యార్థి సంఘ నేత చంద్ర నాయక్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం పశువైద్య విద్యార్థుల సమసమ్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘ నేతలు మోహన్, తేజ, బాల, పూర్ణ, విక్రమ్, రాజ్‌ఖ, చెంగల్‌రెడ్డి, వినోద్, రవితేజ, బాలాజీ నాయక్, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment