
జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి
సత్యవేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జగన్‌మోహన్ ఆచార్యులు (56) శుక్రవారం రాత్రి గుండె నొప్పితో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె అమెరికాలో, కుమారుడు, భార్య హైదరాబాద్‌లో ఉంటున్నారు. చౌడేపల్లి జూనియర్ కళాశాలలో పిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ గత ఏడాది పదోన్నతిపై సత్యవేడు జానియర్ కళాశాలకు వచ్చారు. ఇప్పటికే బైపాస్ సర్జరీ చేసుకొని వైద్యం పొందుతున్నారు. కళాశాల వద్దే ఉన్న ఆయన శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటర్ కళాశాల గదులు పరిశీలిస్తూ వెలుపలకు వచ్చి అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తెల్లవారితే ఇంటర్ పరీక్షకు డిపార్టుమెంట్ ఆఫీసర్ డ్యూటీ చేయాల్సిన ఆయన మృతి చెందడంతో జాకీర్‌హుసేన్(నాగలాపురం జూనియర్ కళాశాల)ను నియమించి ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మృతి పట్ల ఎంఈఓలు కే.రవి, ఉషా, లెక్చరర్లు, విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment