రాక్‌మెన్ పరిశ్రమ పరిశీలన
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం, పంగూరు సమీపంలోని రాక్‌మెన్ కంపెనీలో ఈనెల 3వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైడ్రోజన్ ప్లాంట్‌ను వర్చువల్‌ఽ విధానంలో ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిశీలించారు. ప్లాంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఏర్పేడు సీఐ ఎస్.జయచంద్ర పాల్గొన్నారు.
సూర్యుడిపై పరిశోధనలు
సూళ్లూరుపేట: ఇస్రో 2023 సెప్టెంబర్ 2న పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సూర్యునిపై పరిశోధనలు చేస్తూ అత్యంత విలువైన సమాచారాన్ని సేకరిస్తోందని ఇస్రో తన వెబ్‌సైట్ ద్వారా శుక్రవారం ప్రకటించింది. భారతదేశానికి మొట్టమొదటి సౌర ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్1 కావడం విశేషం. ఆదిత్య ఎల్1లో అమర్చిన పేలోడ్స్ ఒక సంచలనాత్మక పరిశోధనలు చేసిందని తెలియజేశారు. నియర్ ఆల్ట్రా వయెలెట్ బ్యాండ్ (ఎన్‌యూవీ) దిగువ సౌరవాతావరణంలో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లో సౌర మంట ‘కెర్నల్’ మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని చిత్రీకరించినట్టు పేర్కొన్నారు.
రాక్‌మెన్ పరిశ్రమ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment