27వ రోజుకు చేరిన జూడాల నిరసన
తిరుపతి సిటీ: గౌరవవేతనం పెంచాలంటూ ఎస్వీ వెటర్నరీ వర్సిటీ జూడాలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. రూ.7 వేల స్టైఫండ్‌తో నెలవారి ఖర్చులు ఎలా గడపాలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. గౌరవవేతనం పెంచే వరకు తాము సమ్మెను విరమించేది లేదని హెచ్చరించారు.
పింఛన్ల పంపిణీని
తనిఖీ చేసిన కలెక్టర్
తిరుపతి రూరల్: పింఛన్ల పంపిణీని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి రూరల్ మండలం, వేదాంతపురం గ్రామానికి చేరుకున్న ఆయన పంఛన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారా..? లేదా.. ? అని పరిశీలించారు. అనంతరం పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,62,461 మంది పింఛన్లకు రూ.112.06 కోట్లు మంజూరైందని తెలిపారు.
27వ రోజుకు చేరిన జూడాల నిరసన
Comments
Please login to add a commentAdd a comment