
ప్రసన్న వెంకన్న కల్యాణోత్సవంలో గందరగోళం
● వేదికపైకి ఎక్కిన ఆలయ సిబ్బంది పరివారం ● సిబ్బందితో వాగ్వాదానికి దిగిన భక్తులు
రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహణ లోపంతో గందరగోళానికి దారి తీసింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవం జరిపారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభం కాగానే ఆలయ సిబ్బంది, వారి బంధు పరివారం వేదికపైకి ఎక్కారు. దీంతో స్వామి వారి కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు లేకుండా పోయింది. అసహనానికి గురైన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాత్రి స్వామివారి గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment