చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారి మార్గంలోని చిట్టమూరు మండం, బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ చిన్నబలరామయ్య వివరాల మేరకు.. బురదగల్లి కొత్తపాళెం పంచాయతీ, కుమ్మరిపాళెం గ్రామానికి చెందిన కన్నెబోయిన మారెయ్య(38) సోమవారం మోటార్ సైకిల్‌పై కొత్తగుంటకు వెళ్లి మన్నెమాలకు బయలు దేరాడు. బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు వద్ద ట్రాక్టర్ బయ్యవారికండ్రిగ రోడ్డు వైపు తిరుగుతుండగా అదుపుతప్పి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారెయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని నాయుడుపేట వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment