డక్కిలి మండలంలో రూ.2.2 కోట్ల వరకు మంజూరు కాగా దాదాపు నిర్మాణాలు 90 శాతం పూర్తయ్యాయి. ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణాల్లో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు ఇషారాజ్యంగా వ్యవహరించారు. సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వేయలేదన్న విమర్శలున్నాయి. వాస్తవానికి నాణ్యత కలిగిన ఇసుకను వినియోగించాలి. అయితే స్థానికంగా వాగులు, వంకల్లో లభించే ఇసుకను వినియోగించారు. సీసీ రోడ్డు నిర్మాణాల్లో సిమెంట్, ఇసుక, కంకర 1:2:4 నిష్పత్తిలో వినియోగించాలి. అయితే ఇందుకు భిన్నంగా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి.
అవినీతి బట్టబయలు
డక్కిలి మండలంలో సీసీ రోడ్డు నిర్మాణాల్లో జరిగిన అవినీతి మొత్తం క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీ అనంతరం బట్టబయలు అవుతోందని పలు గ్రామాల్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి క్వాలిటీ కంట్రోల్ తనిఖీ అనంతరమే 30 శాతం బిల్లు కాంట్రాక్టర్‌కు వస్తుంది. ఈలోగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీకి రాక ముందే 70 శాతం బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు తహతహలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment