శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,592 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
టీటీడీకి రెండు ఎలక్ట్రిక్
స్కూటర్ల వితరణ
తిరుమల: టీటీడీకి సోమవారం తిరుపతిలోని ఏఎంఆర్‌డీ బిల్డర్స్ ఎండీలు మారుతి నాయుడు, దేవేంద్ర నాయుడు రూ.2.28 లక్షల విలువైన రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వితరణ చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్లకు పూజలు చేసి డెప్యూటీ ఈవో లోకనాథంకు తాళాలు అందజేశారు. కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ /తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని హెచ్‌ఎంలు, టీచర్ల సాధారణ సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎస్ కుమార్ తెలిపారు. వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ జాబితాలను www.chittoor deo.com వెబ్‌సైట్‌లో ఉంచినట్టు తెలిపారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే డీడీవో సంతకంతో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటలలోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. టీచర్ పూర్తి పేరు, కేడర్, సీనియారిటీ జాబితాలోని తప్పిదాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఆధారాలతోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయాలన్నారు. గడువు తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించబోమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment