అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: అర్జీలను తీసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 280 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపైనే 163 అర్జీలు ఉన్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు. రైతు సాధికారతి సమితి నేతృత్వంలో తాజా కూరగాయలను కలెక్టరేట్ వద్ద విక్రయించడానికి ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చారు.
మాటనిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమే
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమేనని ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌డీ రవి పేర్కొన్నారు. అప్కాస్‌ను కొనసాగించాలని కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ నేతలు విచ్చేశారు. కనీస వేతనం రూ.32వేలు చేయాలని తెలిపారు.
అప్కాస్ రద్దును విరమించుకోండి
అప్కాస్ రద్దును విరమించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర డిమాండ్ చేశారు. ఆ మేరకు గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు.
మెస్ చార్జీలు పెంచండి
బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు యూ.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు.
రక్షణ కల్పించండి
బస్టాండ్ సమీపంలోని జయశ్యామ్ సినిమా హాల్ వద్ద ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపై కొందరు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆటోవాలాలు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా సీఐటీయూ నేతలు నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment