తిరుమలలో చిన్నారి అపహరణ
తిరుమల : తిరుమలలో చిన్నారిని గుర్తు తెలియని వృద్ధురాలు తీసుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి తిరుమలలో హ్యాకర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను తన కుమార్తె దీక్షిత(4) షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి ఉంచుకుని తను వ్యాపారం చూసుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో పాప ఆడుకుంటూ సాయంత్రం 5 గంటలకు భక్తురాలైన ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లింది. సదరు వృద్ధురాలు పాపను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై తండ్రి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా వృద్ధురాలు పాపను తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుపతికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి పాపకోసం గాలింపు చేపట్టారు. ఎవరైనా గుర్తిస్తే తిరుమల టూటౌన్ పీఎస్ నెం. 9440796769, 9440796772కు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment