పారదర్శకంగా పది పరీక్షలు
మాట్లాడుతున్న ఆర్జేడీ శామ్యూల్
తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కడప ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని కచ్చేపి స్టేడియంలో పది పరీక్షలపై ఆయన అధికారులతో సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ముందస్తు ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 164 పరీక్షాకేంద్రాల్లో రెగ్యులర్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 28,656 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. మార్చి 5, 6 తేదీల్లో సెట్–1, సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకుంటాయన్నారు. హాల్ టిక్కెట్లు మంగళవారం నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్‌పెట్టాలన్నారు. డీఈఓ కేవీఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment